డిసెంబరు 30వ తేదీన వెస్ట్ బెగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది దేశంలో ఏడో వందే భారత్ రైలు. హౌరా - న్యూజుల్పాయిగురి స్టేషన్ల మధ్య నడుస్తుంది. అయితే, ఈ రైలును పట్టాలెక్కించిన నాలుగు రోజుల్లోనే అగంతకులు ఈ రైలుపై రాళ్లదాడి చేశారు. ముఖ్యంగా ప్రయాణికులతో తొలి ప్రయాణం ప్రారంభించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం.
రైలు కుమార్‌గంజ్ స్టేషన్ దాటుతున్న సమయంలో దాడి జరిగినట్టు ఈస్టర్న్ రైల్వే తెలిపింది. రైలు మల్దా స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. అయితే, ఈ దాడిలో రైలులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలా కాలేదు. ఈ దాడి ఎవరు చేశారు.. ఎందుకు చేశారన్న కోణంలో ఈస్టర్న్ రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు.