దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో అడుగుపెట్టరని రజినీ సోదరుడు సత్యనారాయణ మరోసారి స్పష్టీకరించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదనీ, అంతేకాదు తన కుటుంబ సభ్యులకు కూడా సుతారమూ ఇష్టం లేదని తెలిపారు. రజినీకాంత్ సినిమాలే జీవితంగా ఉంటారన్నారు. ఇది ప్రస్తుతం రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించిన వార్త.