పార్లమెంట్ ప్రారంభోత్సవం.. రాష్ట్రపతి ఎందుకు హాజరు కాకూడదు?

శనివారం, 27 మే 2023 (20:11 IST)
కొత్త పార్లమెంట్ భవనం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభం కానుంది. అయితే రాష్ట్రపతి చేతుల మీదుగా పార్లమెంట్ ప్రారంభోత్సవం జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రధాన మంత్రిపై విమర్శలు గుప్పించారు. 
 
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ఎందుకు హాజరుకాకూడదని కమల్ ప్రశ్నించారు. జాతీయ అహంకారంతో కూడిన ఈ క్షణం రాజకీయంగా విభజనగా మారిందన్నారు. దేశాధినేతగా వున్న రాష్ట్రపతి ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనపోవడానికి తనకు ఓ కారణం కనిపించలేదని కమల్ వెల్లడించారు. 
 
జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకుంటానని కమల్ హాసన్ అన్నారు. కానీ భారత రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, ప్రారంభోత్సవ ప్రణాళికలో ప్రతిపక్ష పార్టీలను చేర్చకపోవడంపై కమల్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు