Ashok Kumar, Leesha Eclairs
అశోక్ కుమార్ ,లీషా ఎక్లెయిర్స్ హీరోహీరోయిన్ లు గా A. J సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ " ప్రియమైన ప్రియ. A J. సుజిత్ ,A బాబు నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ అండ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా ఈ చిత్రానికి సంగీతం అందించారు..ఈ చిత్రం సంగీత దర్శకుడిగా శ్రీకాంత్ దేవాకు 100 వ చిత్రం కావడం విశేషం.. సి.హెచ్ సీతారామ్ యాదవ్ నిర్మాణ నిర్వాహణలో రూపోందిన ఈమూవీని మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా థియేటర్ లలో రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.