మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోకపోయినా.. రెండో భర్త నుంచి భరణం పొందొచ్చు.. ఎలా?

ఠాగూర్

గురువారం, 6 ఫిబ్రవరి 2025 (14:03 IST)
మొదటి భర్త నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకోకపోయినప్పటికీ రెండో భర్త నుంచి భరణం పొందవచ్చని సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. మొదటి భర్త నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకోనందున రెండో భర్త నుంచి ఎలాంటి భరణం పొందే హక్కు భార్యకు లేదని తెలంగాణ కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోకుండా వేరుగా ఉంటూ రెండో వివాహం చేసుకున్న భర్త నుంచి సెక్షన్ 125 క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం పరిహారాన్ని పొందవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. భరణం అనేది భార్య పొందే ప్రయోజనం కాదని, భర్త నైతికపరమైన, చట్టపరమైన విధి అని స్పష్టం చేసింది. 
 
చదువుకోసం స్కూలుకు పంపితే.. మీ టీచర్లు గర్భవతిని చేశారు.. 
 
విద్యాబుద్ధులు చెప్పిన మంచి భవిష్యత్ ఇవ్వమని పాఠశాలకు పంపితే ఆ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం ఆ విద్యార్థిని గర్భవతిని చేశారు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. 13 యేళ్ల బాలికపై ముగ్గురు కామాంధులైన ఉపాధ్యాయులు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణగిరి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 13 యేళ్ల బాలిక ఎనిమిదో తరగతి విద్యాభ్యాసం చేస్తుంది. అయితే, ఈ బాలిక గత కొన్ని రోజులుగా పాఠశాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సహచర ఉపాధ్యాయులు, విద్యార్థుల వద్ద ఆరా తీయగా, వారిలో ఏ ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేదు కదా దాటవేత సమాధానం ఇచ్చారు. దీంతో ఆ బాలిక ఇంటికి స్వయంగా ప్రధానోపాధ్యాయుడు వెళ్లి అడగ్గా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తమ కుమార్తె గర్భందాల్చిందని, అబార్షన్ చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళుతున్నామంటూ బోరున విలపిస్తూ చెప్పింది. మీ పాఠశాలలోనే పనిచేస్తున్న ప్రకాష్ (37), ఆర్ముగం (45), చిన్నస్వామి (57) అనే ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పడంతో హెచ్.ఎం నివ్వెరపోయాడు. దాంతో వెంటనే ఈ ఘటనపై ఆయన పోలీసులకు సమాచారం అందించి, బాలిక పేరెంట్స్‌తో జిల్లా బాలల భద్రతాధికారులకు ఫిర్యాదు చేయించారు. ఈ ముగ్గురు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు