గుజరాత్‌లోని వడోదర, అహ్మదాబాద్ బీఎఫ్ 7 సబ్ వేరియంట్ కేసులను గుర్తించడం జరిగింది. వడోదరలోని సభాన్ పుర ప్రాంతంలో నివాసం వుంటున్న ఒక ఎన్నారై మహిళకు బీఎఫ్7 వేరియంట్ సోకినట్లు తేలింది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నా.. ఆ మహిళలో బీఎఫ్.7 వేరియంట్ సంక్రమించింది.
ఈ వేరియంట్ చైనాతో ఇతర దేశాల్లో విలయ తాండవం చేస్తుండటంతో భారత్‌లోనూ భయాందోళన మొదలైంది. ఈ వేరియంట్ లక్షణాల సంగతికి వస్తే.. జలుబు, దగ్గు, జ్వరం, శరీర నొప్పులు మొదలైనవి.