ఈ సందర్భంగా సీఎఁం ఖటటర్ మాట్లాడుతూ, మహిళలకు ఉపాధి అవకాశాల కల్పన కోసం తమ ప్రాంతంలో ఓ పరిశ్రమ ఏర్పాటుచేయాలని కోరిన మహిళకు... సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ 'నిన్ను చంద్రయాన్-4 మిషన్‌లో పంపుతాం లే.. కూర్చో' అంటూ ఎగతాళి చేశారు. ఓ బహిరంగ కార్యక్రమంలో జరిగిన ఈ సంభాషణ తాలూకు వీడియో వైరల్‌గా మారింది.
హిసార్ జిల్లాలో ప్రస్తుతం జన్ సంవాద్ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా ఖట్టర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఖరిపై కాంగ్రెస్, ఆప్ నేతలు మండిపడ్డారు. 'హర్యానా నుంచి మధ్యప్రదేశ్ దాకా ప్రజలు ఈ నేతల అహానికి తగిన జవాబిస్తారు. సమయం వచ్చినపుడు వాళ్లకే చంద్రుడిని, చుక్కలను చూపిస్తారు' అని సీనియర్ కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.