మణిపూర్ వాసులు తనను ఘోరంగా అవమానించారని, అందువల్ల రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు ఆ రాష్ట్ర ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. మణిపూర్‌లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు కోరుతూ 16 ఏళ్ల పాటు ఆమె నిరాహారదీక్ష చేసిన విషయం తెల్సిందే.
ఈ దీక్షను ఇటీవలే విరమించారు. అనంతరం రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఇందుకోసం ఆమె పీఆర్‌జేఏ అనే పార్టీని స్థాపించారు. పీఆర్‌జేఏ పార్టీ తరపునే మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఇబోబి సింగ్‌పై పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు.