దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్య స్పందిస్తూ... భారత్ ఎవరితోనూ యుద్ధాన్ని కోరుకోదన్నారు. అయితే, భారత్‌ను రెచ్చగొడితే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. ఇటీవల పీవోకేలో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
తరుచూ విసిగించే పనిని కొంతమంది జనం చేస్తుంటారని, అటువంటివారిపై కేంద్రం నిశ్శబ్దంగానే డీల్ చేస్తుందని, ఈ విషయంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే.. భారత ఆర్మీ కూడా పీవోకేపై అదే రీతిలో దాడి చేసిందని అన్నారు.