ప్రేమ పేరుతో వంచించాడు.. పెళ్లికి నో చెప్పాడు.. అంతే మర్మాంగాన్ని?

శనివారం, 24 జూన్ 2017 (18:02 IST)
ప్రేమ పేరుతో వంచించి పెళ్లి మాటెత్తే సరికి ముఖం చాటేసిన ప్రేమికుడి మర్మాంగాన్ని కట్ చేసేసింది.. ఓ ప్రియురాలు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని మంగేళ్‌పురి ప్రాంతానికి చెందిన రవి (35) అనే వ్యక్తి.. 23 ఏళ్ల మహిళను ప్రేమించినట్లు తెలుస్తోంది. అయితే రవి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. పెద్దల అంగీకారం లేకపోవడంతో ప్రేమించిన మహిళకు రవి దూరమయ్యాడు. 
 
ఈ నేపథ్యంలో ప్రేమించిన వ్యక్తి ముఖం చాటేసేందుకు కారణం ఏమిటని అడిగేందుకు ఈ నెల 21వ తేదీ రవిని ఆతని ప్రేయసి కుటుంబీకులు ఇంటికి పిలిపించారు. రవి కూడా ప్రేయసి ఇంటికి వెళ్లాడు. పెద్దలు అంగీకరించకపోయినా, ఇన్నాళ్లు తనను ప్రేమించిన తనను వివాహం చేసుకోవాల్సిందిగా ప్రియురాలు కోరింది. 
 
కానీ రవి మాత్రం పెద్దల అంగీకారంతోనే తన పెళ్లి జరుగుతుందని తేల్చి చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ప్రియురాలు ప్రియుడిని బాత్రూమ్‌లో లాక్ చేసి.. వంటకు ఉపయోగించే కత్తితో మర్మాంగాన్ని కోసేసింది. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరారీలో ఉన్న రవి ప్రేయసితో పాటు అతని కుటుంబీకులను పోలీసులు గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి