భర్తతో హనీమూన్... ప్రియుడితో జంప్...కొత్త పెళ్లికూతురు హ్యాండ్.... ఎక్కడ?

బుధవారం, 18 మే 2016 (14:25 IST)
కొత్తగా పెళ్లయింది. హనీమూన్‌ కోసం చల్లటి ప్రదేశం హిమాలయాలకు వెళ్లారు. అక్క‌డ కొద్ది రోజులు ఆనందంగా గ‌డిపి అక్కడి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చారు. కాగా అత్యవసర పరిస్థితిలో వాష్ రూముకు వెళ్లిన భార్య, ఎంతసేపటికీ తిరిగిరాక పోవడంతో ఆ భ‌ర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు విమానాశ్రయం చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. ఆ ఫుటేజ్‌ని చూసిన భర్త షాక్ తిన్నాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
 
హిమాలయాల్లోని బాగ్ గోద్రాలో హనీమూన్ ముగించుకున్న కొత్త జంట ఢిల్లీ ఎయిర్‌పోర్టుకి వచ్చారు. ఆ తర్వాత వాష్ రూముకంటూ వెళ్లిన భార్య, లోపలే ఓ బురఖా ధరించి బయటకు వచ్చింది. ఆపై వెళ్లి మరో వ్యక్తిని కలవగా, వీరిద్దరినీ ఇంకో వ్యక్తి కలిశాడు. ముగ్గురూ కలిసి టాక్సీ స్టాండ్‌కు వెళ్లి కారెక్కేశారు. ఆమె ప్రియుడు సైతం అదే విమానంలో వచ్చి ఉండవచ్చని, అతనితో ఆమె వెళ్లిపోయిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఏం చెప్పాలో తెలియని భర్త.. పోలీసులకు చేసిన ఫిర్యాదును వాపస్ తీసుకుని బేలమొహం వేసుకుని వెళ్లిపోయాడు. దీనిపై ఎలాంటి కేసూ నమోదు కాలేదని ఢిల్లీ ఎయిర్‌పోర్టు పోలీసు వర్గాలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి