నా భార్యను నిత్యానంద చెరబట్టాడు.. రక్షించండి... కలెక్టర్‌కు వినతి

మంగళవారం, 12 జూన్ 2018 (10:50 IST)
వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి మరోమారు వార్తలకెక్కారు. తన భార్యను నిత్యానంద చెరబట్టాడనీ, ఆయననుంచి తన భార్యను రక్షించి తనకు అప్పగించాలని నామక్కల్ జిల్లా కలెక్టర్‌కు ఓ వ్యక్తి వినతిపత్రం అందజేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నామక్కల్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో తన భార్య, కుమారుడు కొన్ని నెలల క్రితం బెంగుళూరులోని నిత్యానంద ఆశ్రమానికి వెళ్లారని, ఆ తర్వాత వారు తిరిగి రాలేదని పిటిషన్‌లో బాధితుడు పేర్కొన్నాడు. 
 
ఈ విషయం గురించి ఇప్పటికే నామక్కల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, బెంగుళూరుకు వెళ్లిన పోలీసులు తన కుమారుడిని విడిపించారని తెలిపాడు. కానీ, తన భార్య ఆచూకీ మాత్రం ఇంత వరకు తెలియరాలేదని వాపోయాడు.
 
ఫలితంగా తాను గత ఎనిమిది నెలలుగా మానసిక వేదనను అనుభవిస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం తనకు ఆత్మహత్య తప్పమరో దారి లేదని... తన భార్యను నిత్యానంద నుంచి విడిపించాలని కోరాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు