యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఢిల్లీతో పాటు.. దాని ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు హతినికుండ్ ప్రాజెక్టు నుంచి వరద నీటికి ఒక్కసారిగా భారీగా విడుదల చేశారు. దీంతో యమునా నది ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహిస్తుంది. ఈ కారణంగా దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలకు వరద ముప్పు పొంచి ఉంది.
యమున నది నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండడంతో అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలకు బోట్లను అధికారులు అందుబాటులో ఉంచారు. అలాగే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.