పంచాయతీ ఎన్నికల్లో భాగంగా లఖింపూర్ ఖేరీ పరిధిలో చివరి రోజైన నిన్న నామినేషన్ వేసేందుకు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ మహిళ వెళ్లగా ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డుకుని, ఆమె చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కుని, చీర పట్టుకుని లాగారు. అక్కడే ఉన్న కొందరు వచ్చి ఆమెను విడిపించారు.
బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికార దాహంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గూండాలే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు.
మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఓ సీఐ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు ఉన్నారు.