ఆమె ప్రేమను పొందే వరకూ మహా బుద్ధిమంతుడిలా నటించాడు. అలా ఆమెను బుట్టలో పడేసి ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. సన్నిహితంగా మెలుగుతూ ఫోటోలు కూడా దిగాడు. ఐతే ఆమెతో ప్రేమాయణం సక్సెస్ కావడంతో ఇక బుద్ధిమంతుడు ముసుగు తీసి అవతల పారేశాడు. అసలు రూపం చూపించాడు. జులాయిగా తిరుగుతూ బాధ్యతలేని వాడిలా మారాడు. అతడిలో ఈ మార్పు గమనించిన యువతి దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఇది భరించలేని ఆ యువకుడు తనలో వున్న మరో రూపాన్ని ఆమెకి చూపించడం మొదలుపెట్టాడు.
తనతో ఇన్నాళ్లు ఎలాంటి భయం లేకుండా గడిపినదానివి ఇపుడెందుకు దూరం పెడుతున్నావంటూ ప్రశ్నించాడు. తన కోర్కె తీర్చాలని వేధించాడు. తనకు ఇవ్వకపోతే తనతో సన్నిహితంగా దిగిన ఫోటోలను బయటపెడతానంటూ బెదిరించాడు. దాంతో యువతి బెదిరిపోయి బ్రతిమాలింది. ఐతే తనకు రూ. 50 వేలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేసాడు. తన వద్ద అంతలేదని 15 వేల రూపాయలు ఇచ్చింది. ఐనా అతడి వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.