యువతకు తమ మనస్సుకు నచ్చినవారితో జీవించే హక్కు ఉందని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మతాంతర వివాహం చేసుకున్న ఓ యువతి.. తన భర్తతో కలిసి జీవించేలా ఆదేశాలిస్తూ, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. పై విధంగా వ్యాఖ్యానించింది.
వారిని వెతికి పట్టుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరినీ ఓ గదిలో నిర్బంధించారు. అయితే, వారు తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. తామిద్దరం మేజర్లమని, తమకు కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం యువతీయువకులు ఇద్దరినీ తమ ఎదుట హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చని అన్నారు. నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు యువతీ యువకులకు ఉందంటూ తీర్పునిచ్చారు. పైగా, ఆ నవదంపతులకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు.