పేవ్‌మెంట్ పైన నిద్రపోతున్న యువకుడిపై కారు ఎక్కించింది: వైకాపా ఎంపీ కూతురి అరెస్ట్

సెల్వి

మంగళవారం, 18 జూన్ 2024 (22:28 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరం, బెసెంట్ నగర్‌లో వేగంగా కారు నడిపి ఓ యువకుడిని బలిగొన్న వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురి (33) అరెస్ట్ అయ్యింది. చెన్నైలోని బీసెంట్ నగర్లో ఫుట్ ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వృత్తిరీత్యా పెయింటర్ సూర్య (24) అనే యువకుడి పై కారు దూసుకెళ్లడంతో  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వైసీపీ రాజ్యసభ ఎంపీ కూతురుగా పోలీసులు నిర్ధారించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి ముందు బెసెంట్ నగర్.. వూర్ కుప్పంకు చెందిన 22 ఏళ్ల సూర్య రోడ్డుకు సమీపంలోని ఫ్లాట్ ఫామ్‌లో నిద్రిస్తున్న నేపథ్యంలో ఆ మార్గం ద్వారా వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి సూర్యపై ఎక్కి దిగింది.
 
ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన సూర్య.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురి (33) అని పోలీసులు వెల్లడించారు. 

Daughter of @YSRCParty #RajyaSabhaMP #BeedaMastanRao, Madhuri, arrested by @chennaipolice_ after her car ran over 24-yr-old painter Surya sleeping on pavement in #BeasantNagar, seriously injuring him, succumbed in hospital; accused identified by cctv footage; granted station bail pic.twitter.com/HWZOeMR6rt

— Uma Sudhir (@umasudhir) June 18, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు