ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు జికా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమె నమూనాలను కోయంబత్తూర్‌లోని ల్యాబ్‌కు పంపించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. వీటితో పాటు మరో ఐదు నమూనాలను అలప్పుజాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా అవన్నీ నెగటివ్ వచ్చినట్లు తెలిపారు.
రాష్ట్రంలో జికా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్టా అక్కడి ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దీంతో వీటి నిర్ధారణకు ఉపయోగించే 2100 టెస్ట్ కిట్లను రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మెడికల్ కాలేజీలలో అందుబాటులో ఉంచింది. కేవలం ఆదివారం జరిపిన పరీక్షల్లోనే ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 46 ఏళ్ల వ్యక్తి, 29 ఏళ్ల హెల్త్ వర్కర్‌తోపాటు 22 నెలల వయసున్న చిన్నారి ఉన్నారు. ప్రస్తుతం వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.