నవరాత్రి 2వ రోజు... బ్రహ్మచారిణీ అవతారం... అమ్మవారికి మల్లెలంటే ఇష్టం(వీడియో)

గురువారం, 7 సెప్టెంబరు 2017 (15:22 IST)
నవరాత్రుల రెండవ రోజు (సెప్టెంబర్ 22) బ్రహ్మచారిణీ మాతని నిష్ఠతో ఆరాధిస్తారు. ఈ మాత శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. నారింజ, తెలుపు రంగుతో కూడిన దుస్తులతో అమ్మవారిని అలంకరించి.. భక్తులు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. మంగళాలను, సంపదను, సంతోషాన్ని, ప్రశాంతతను ఈమె ప్రసాదిస్తుంది. ద్వితీయ తిథి నాడు సతీదేవి రూపంగా ఆమెను స్తుతిస్తారు. ఆమె బ్రహ్మచారిణీ అవతారం కావడంతో నవరాత్రుల్లో రెండో రోజున ఆమె పూజలందుకుంటుంది. 
 
రెండు చేతులు కలిగివుండి, కుడిచేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి వుంటుంది. శివునిని వివాహం చేసుకునేందుకు 1000 ఏళ్ల పాటు అమ్మవారు ఉపవసించి పువ్వులు, పండ్లు మాత్రమే తీసుకుని తపస్సు చేసిందని, మరో వందేళ్లు ఆకులు, కూరగాయలు, తీసుకుని స్వామి కోసం బ్రహ్మచారిణీగా పూజలు చేసిందని పురాణాలు చెప్తున్నాయి. ఈమెకు మల్లెపువ్వులంటే చాలా ఇష్టం.
 
బ్రహ్మచారిణి దేవిని 
"దధానకర పద్మాభ్యం అక్షమాలా కమండలా 
దేవి ప్రదాతు మయీ బ్రహ్మచారిణ్యనుత్తమా" అంటూ స్తుతించాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు