నవరాత్రి, దసరాతో పదిరోజుల పండుగ మనముందుకు వచ్చేస్తోంది. ఈ నెల (సెప్టెంబర్) 20వ తేదీ నుంచి 30వరకు నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగనున్నాయి. నవరాత్రుల్లో అమ్మవారిని నిష్టతో పూజిస్తే సకల సంపదలు, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు.
ఈ పూజ మొదటి రోజు శైల పుత్రి మాతతో ప్రారంభమై ఆఖరి రోజు సిద్ధిధాత్రి మాతతో ముగుస్తుంది. అందుకే తొలి రోజున శైలపుత్రిని పూజించాలి. ప్రతిపాద తిథి ప్రారంభం = సెప్టెంబర్ 20, రాత్రి 10.59 నుంచి సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 10.34 గంటల వరకు. సెప్టెంబర్ 21, చంద్రదర్శనం, నవరాత్రి ప్రారంభం, ఘంటాస్థపన ముహూర్తం ఉదయం 6.12 నుంచి 08.09 వరకు (నిడివి 1 గంటా 56 నిమిషాలు).
నవరాత్రి ఆరంభం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అనే తిథి రెండు రకాలుగా వుంటుంది. శుద్ధ తిథి అంటే సూర్యోదయము నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు వుంటుంది. దీనిప్రకారం మొదటి రోజు సూర్యోదయానంతరం అమావాస్య కొన్ని ఘడియలుండి, అనంతరం పాడ్యమి ప్రారంభమై.. మరుసటి సూర్యోదయానికి ముందే పూర్తవుతుంది. అమావాస్యతో కూడిన పాడ్యమి నాటి నుంచి నవరాత్రులు ఆరంభించాలని పండితులు చెప్తున్నారు.
రాత్రిపూట, పగటి పూట ఘంటస్థాపన చేయకూడదు. నవదుర్గల అవతారాల్లో మొట్ట మొదట పూజలందుకునేది శైల పుత్రి మాత. శైల పుత్రి మాతని నవరాత్రుల ప్రారంభ రోజున బూడిద రంగు వస్త్రాలతో అలంకరించి మట్టి ఘటం మీద స్థాపిస్తారు. భక్తులు ఆరోజు పసుపు రంగు దుస్తులు ధరించాలి.
తొలిరోజున శైలపుత్రిని
వందే వాంచిత లాభాయ చంద్రార్థకృత శేఖరమ్
వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్ అనే మంత్రంతో స్తుతించాలి.