సాయంత్రం సమయంలో వేడివేడి పకోడి వండిపెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అది రొటీన్‌గా కాకుండా రకరకాల పద్దతులలో పకోడీ చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. మనకు లభించే కూరగాయలలో అనేక రకములైన పోషకాలు దాగి ఉంటాయి. మనకు బయట లభించే చిరుతిండ్ల కన్నా ఇన్ని పోషకాలు ఉన్న కూరగాయలతో పకోడి చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.... వెజిటేబుల్ పకోడీ ఎలా చెయ్యాలో చూద్దాం.
పాలకూర తరుగు : 2 టేబుల్ స్పూన్లు,
తోట కూర తరుగు : 2 టేబుల్ స్పూన్లు,
కొత్తిమీర తరుగు : రెండు టేబుల్ స్పూన్లు,
కేబేజీ తరుగు : రెండు టేబుల్ స్పూన్లు,
చిన్నగా కట్ చేసిన కాలీ ప్లవర్ : రెండు టేబుల్ స్పూన్లు,
ఉల్లి ముక్కలు : అర కప్పు,
పచ్చిమిర్చి పేస్టు : టేబుల్ స్పూన్
అల్లం రసం : టేబుల్ స్పూన్,
ఉప్పు : సరిపడా,
నూనె : వేయించటానికి సరిపడా.
తయారుచేయు విధానం :
శెనగ పప్పు, పెసర పప్పు, బియ్యం మూడు గంటలు ముందు నానబెట్టి మెత్తగా రుబ్బాలి. రుబ్బిన పిండిలో ఫైన చెప్పిన వెజటబుల్స్ అన్నీ కలిపి ముద్దలా చెయ్యాలి. ఆ మిశ్రమంలోనే అల్లంరసం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్టు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి నూనె వేడి చెయ్యాలి . నూనె కాగిన తరువాత పిండిని పకోడిలా వేసి దోరగా వేపుకోవాలి. అంతే.. వేడివేడి వెజిటబుల్ పకోడీ రెడీ.