Chicken Pepper Fry.. ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి?

సెల్వి

బుధవారం, 11 సెప్టెంబరు 2024 (20:03 IST)
కావలసిన పదార్థాలు: 
చికెన్ - 300 గ్రా
ఉల్లిపాయ - 75 గ్రా
కరివేపాకు - 5 గ్రాములు
ఉప్పు - రుచికి తగినంత 
నూనె - తగినంత
వెల్లుల్లి - 10 గ్రాములు
పసుపు - 2 గ్రాములు
కారం పొడి - 5 గ్రాములు
పెప్పర్ - 10 గ్రా
జీలకర్ర - 3 గ్రాములు
అల్లం - 5 గ్రాములు
 
తయారీ విధానం
చికెన్ ముక్కలను కడిగి ఉప్పు, రుబ్బిన మసాలాలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. ఆపై  తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకులను నూనెలో బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత ఉడికించిన చికెన్ వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. ఇది వేగాక కాసింత మిరియాల పొడి చేర్చాలి. అంతే చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ అయినట్లే. ఈ గ్రేవీ రోటీలకు, అన్నంలోకి టేస్టీగా వుంటుంది. 
 
పెప్పర్ చికెన్ ఆరోగ్య ప్రయోజనాలు
పెప్పర్ చికెన్ ఫ్రైలో లైకోపీన్, ఫాస్ఫరస్, కాపర్, పాంతోతేనిక్ యాసిడ్, విటమిన్ బి6, బయోటిన్, విటమిన్ ఇ, ప్రోటీన్, విటమిన్ డి, బీటా కెరోటిన్, లుటిన్, సెలీనియం, నియాసిన్ వంటి పోషకాలు వుంటాయి. ఇది కండరాలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు