పెరుగుతున్న టమాటా, ఉల్లి ధరలను అదుపు చేయాలి..

సెల్వి

మంగళవారం, 25 జూన్ 2024 (10:45 IST)
Tomato Onion
పెరుగుతున్న టమాటా, ఉల్లి ధరలను అదుపు చేసేందుకు అధికారులు, హోల్ సేల్ వ్యాపారుల సంఘం ప్రతినిధులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏలూరు జాయింట్ కలెక్టర్, జిల్లా ధరల నియంత్రణ కమిటీ అధ్యక్షురాలు బి.లావణ్యవేణి కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో జిల్లాలో కూరగాయల ధరల నియంత్రణపై అధికారులు, సంఘం ప్రతినిధులతో ఆమె సమీక్షించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పది రోజుల క్రితం రూ.34 ఉన్న టమాట ధర రూ.60కి పెరిగిందని, ఉల్లితోపాటు పలు కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు.

వీటిని నియంత్రించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. మదనపల్లె నుంచి తక్కువ ధరకు టమోటాలు తెచ్చి జిల్లాలోని ఏలూరు, కైకలూరు, నూజివీడు రైతుబజార్లలో రూ.40-50కి విక్రయించాలని ఆమె కోరారు. కూరగాయల ధరలు, నాణ్యతలో తేడాలుంటే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు