చింత చిగురును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చింతచిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇటువంటి చింతచిగురుతో చికెన్ కూర ఎలా చేయాలో చూద్దాం.
పసుపు - చిటికెడు
గరంమసాలా - 1 స్పూన్
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనెను వేసి ఆవాలు, జీలకర్ర బాగా వేయించుకోవాలి. తరువాత ఉల్లిముక్కులు వేసుకుని అవి వేగాక ఆ మిశ్రమంలో పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తరువాత కొబ్బరితురుము వేసి నిమిషం పాటు వేయించుకుని చికెన్ ముక్కులు వేసి ఉప్పు, కారం, ధనియాలపొడి, నీళ్లను పోసి ఉడికించుకోవాలి. చివరగా ఆ మిశ్రమంలో చింతచిగురు వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకుని గరంమసాలా వేసి నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంతే చింతచిగురు మాంసం రెడీ.