చికెన్ చీజ్ శాండివిజ్ ఎలా చేయాలో చూద్దాం..

శనివారం, 4 ఆగస్టు 2018 (14:16 IST)
చికెన్, చేపలు తినేవారికి పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. చికెన్ కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. అయినా కొలెస్ట్రాల్ లెవల్‌ను తగ్గిస్తుంది. కాబట్టి చికెన్‌ను ఆయిల్ వేయకుండా వండి తినడం వల్ల గుండెకు కూడా ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి చికెన్‌తో చీజ్‌ను కలిపి శాండివిజ్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
బ్రెడ్‌ స్లైసులు - 14,
బోన్‌లెస్ చికెన్ - అర కేజీ
ఉల్లిపాయ-ఒకటి, 
పుదీనా తరుగు- చెంచా, 
చీజ్‌ స్లైసులు- ఆరు, 
చిల్లీసాస్‌ - రెండు చెంచాలు,
వెన్న - అరకప్పు, 
పచ్చిమిర్చి- రెండు, 
ఉప్పు- రుచికి సరిపడా, 
మిరియాలపొడి - చెంచా. 
 
తయారీ విధానం: ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్‌ ముక్కలకు మిరియాలపొడి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పువేసి ఉడికించి పెట్టుకోవాలి. దీన్ని మిక్సీలో రుబ్బుకుని.. పక్కనబెట్టుకోవాలి. తర్వాత పుదీనా తరుగూ, తగినంత ఉప్పు, చిల్లీసాస్‌ కలిపి ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి.

అలాగే బ్రెడ్‌స్లైసుల్ని పెనంపై ఉంచి.. వెన్నతో కాల్చి తీసుకోవాలి. ఒక స్లైసుపై చీజ్‌ స్లైసు, ఉల్లిపాయ ముక్క ఉంచాలి. మధ్యలో చికెన్‌ మిశ్రమాన్ని ఉంచి.. మరో స్లైసుతో మూసేయాలి. వీటిని లేతగా వేడిపై రెండు నిమిషాలుంచి.. సర్వింగ్ ప్లేటులోకి తీసుకుని.. మీకు నచ్చిన సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు