మటన్ కబాబ్ తయారీ విధానం...

సోమవారం, 15 అక్టోబరు 2018 (12:38 IST)
మటన్ ఆరోగ్యానికి చాలా మంచిది. మటన్ తీసుకుంటే శరీరంలో తెలుపు రక్త కణాలను పెంచుతాయి. ఇవి శరీరంలోని బ్యాక్టీరియాతో పోరాడుతాయి. మటన్‌లోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనారోగ్య సమస్యలు నుండి కాపాడుతాయి. దాంతో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. మరి ఈ మటన్‌తో కబాబ్ ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
మటన్ కీమా - 150 గ్రాములు
చికెన్ కీమా - 100 గ్రాములు 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్స్
ఉల్లి పేస్ట్ - 1 స్పూన్
కారం - 2 స్పూన్స్
ధనియాల పొడి - 1 స్పూన్
జీలకర్ర పొడి - 1 స్పూన్
మిరియాల పొడి - 3 స్పూన్స్
ఆమ్‌చూర్ - 1 స్పూన్
అల్లం పొడి - అరస్పూన్
జీడిపప్పు పేస్ట్ - 1 స్పూన్
శెనగపిండి - 2 స్పూన్స్
కోడిగుడ్డు - 1
కొత్తిమీరు - 1 కప్పు
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా గిన్నెలో మటన్, చికెన్ కీమాలను వేసి అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, జీడిపప్పు పేస్ట్, నూనె, ఆమ్‌చూర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత శెనగపిండి, కోడిగుడ్డు సొన, ఉప్పు వేసి కలిపి గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత సీకులకు నూనె రాసి ముందుగా తయారుచేసుకున్న మిశ్రమాన్ని పూయాలి. వీటిని గ్రిల్‌లో పెట్టి కాల్చుకోవాలి. చివరగా కొత్తిమీరు చల్లి తీసుకుంటే వేడివేడి మటన్ కబాబ్ రెడీ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు