మాంసాహారం వంటకాలలో చికెన్ వంటలు అద్బుతమైన రుచిని అందిస్తాయి. చికెన్‌తో రకరకాల వంటలను చేసుకోవచ్చు. కొంతమందిలో ఒకేరకమైన చికెన్ వంటలను వండటం వలన దానిమీద బోర్ కొడుతుంది. అలాకాకుండా చికెన్‌ను వెరైటీగా వండినట్లయితే పిల్లలు, పెద్దవారు లొట్టలేసుకుంటూ తినవలసిందే మరి. ఒకసారి తింటే వదిలిపెట్టని బోన్‌లెస్ చిల్లీ చికెన్‌ను ఎలా చేయాలో తెలుసుకుందాం.
కార్న్ ఫ్లోర్ - అర కప్పు,
గుడ్డు - ఒకటి (గుడ్డులోని మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకుని బాగా బీట్ చేయాలి),
వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పును,
అల్లం పేస్ట్ - అర టీస్పును,
నూనె-డీప్ ప్రై చేయడానికి సరిపడా,
పచ్చిమిర్చి- రెండు,
వెనిగర్ - రెండు టేబుల్ స్పూన్లు,
నీళ్ళు- సరిపడా.
తయారుచేయు విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులో కార్న్ ఫ్లోర్, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గుడ్డు, నీళ్ళు పోసి చిక్కగా.. జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత కడాయ్ స్టౌమీద ఉంచి, అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడెక్కిన తర్వాత కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మరో పాన్‌ను స్టౌ మీద పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు గోధుమ రంగులోకి వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో సోయా సాస్, వెనిగర్, ఫ్రైడ్ చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని గ్రేవీలా కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. అంతే... ఎంతో రుచికరమైన బోన్‌లెస్ చిల్లీ చికెన్ రెడీ.