భారత్ పర్యటన విజయవంతం : జాన్ బ్రంబీ

FILE
భారతదేశంలో తాను జరిపిన పర్యటన విజయవంతంగా ముగిసిందని విక్టోరియా రాష్ట్ర ప్రధానమంత్రి జాన్ బ్రంబీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఏఏపీ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. భారతీయులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

తన పర్యటనలో భాగంగా భారతదేశంలోని పలు విద్యా సంస్థలను సందర్శించాననీ... పలు వాణిజ్య సమావేశాల్లో పాల్గొన్నానని బ్రంబీ అన్నట్లు ఏఏపీ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే భారతీయులపై దాడులు పునరావృతం కావన్న సందేశాన్ని భారతీయుల్లోకి బలంగా తీసుకెళ్లగలిగానని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారని పై వార్తా సంస్థ తెలిపింది

ఇదిలా ఉంటే.. జాన్ బ్రంబీ ఎనిమిది రోజులుపాటు భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాలో జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో ఆందోళనలు మిన్నంటిన సంగతి విదితమే. అయితే.. విద్యార్థులకు పూర్తి రక్షణ అందిస్తామనీ, ప్రపంచంలోని సురక్షిత ప్రాంతాలలో మెల్‌బోర్న్ ఒకటని బ్రంబీ తన పర్యటనలో నొక్కి చెప్పారు. ఇదంతా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా తెలుసునని ఆయన వివరించారు.

వెబ్దునియా పై చదవండి