పాల పిట్ట - ఆటా తెలంగాణ సాహిత్య సంచిక ప్రత్యేకం... బహుమతుల వివరాలు
గురువారం, 4 ఆగస్టు 2016 (18:24 IST)
జూలై 8-10 తేదీల్లో డెట్రాయిట్‌లో ఆటా తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ప్రథమ తెలంగాణ ప్రపంచ మహా సభల్లో ప్రవాస తెలంగాణ సాంస్కృతిక సమరుజ్జీవన ప్రత్యేక సంచికని “పాలపిట్ట”ని కడియం శ్రీహరి, స్వామి గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్ గార్లు, కన్వీనర్ నాగేందర్ ఐత, సావనీర్ కమిటీ చైర్మన్ రాజ్ మాడిశెట్టి, సంపాదకులు కృష్ణ చైతన్య అల్లం గార్లు, కమిటీ సభ్యులు కలిసి ఆవిష్కరించారు.
దాదాపు రెండువందల పేజీలున్న ఈ సంచికలో ఎందరో వర్ధమాన, ప్రముఖ రచయితలు, మేధావులు, ప్రొఫెసర్లు, డాక్టరేట్లు, జర్నలిస్టులు తమ అమూల్యమైన సాహిత్యాన్ని, విజ్ఞానాన్ని అందించారు. అతి తక్కువ సమయంలో ఉన్నత ప్రమాణాలతో సంచిక రూపొందించడం, సభకు హాజరైన వారికి వారి కుటుంబ చిత్ర పటంతో కూడిన వ్యక్తిగతీకరించిన ప్రత్యేక సంచికని రూపొందించి ఇవ్వడం లాంటి వినూత్న రీతుల్ని ప్రవేశ పెట్టి సఫలీక్రుతులం కావడం పట్ల చైర్మన్ రాజ్ మాడిశెట్టి ఆనందం వ్యక్తం చేసారు.
సంపాదకులు కృష్ణ చైతన్య అల్లం మాట్లాడుతూ, ఆహ్వానం పంపగానే ఎందరో రచయితలూ, మేధావులు తమ సహాయాన్ని అందించారని, సభలు ముగిసిన తరవాత కూడా వర్షం వెలిసిన తరవాత పరిమళించే మట్టి వాసన లాగా ఈ సావనీర్ పరిమళాన్ని పంచుతూనే ఉంటుందని తెలియ చేసారు. రచనల ఆహ్వానంలో కూడా కేవలం ప్రథమ, ద్వితీయ పారితోషకం కాకుండా ప్రచురణకు స్వీకరించిన ప్రతీ ఆహ్వానితుల రచనకూ ప్రథమ బహుమతి పారితోషికం ఇవ్వాలని ప్రతిపాదించినపుడు కన్వీనర్ నాగేందర్ ఐత గారు ప్రతిపాదనని ఆమోదించి, అందించిన సహాయం అభినందనీయం అని తెలిపారు.
అతిథి రచనలు – రచయితలు
(క్రింద తెలిపిన వారికి సంచిక ప్రతి త్వరలో అందజేయబడుతుంది)
కవిత్వం
అలా మొదలైంది (వెంకట్ ఎక్క)
కౌశల్య నీతి (ఇల్లెందుల వరలక్ష్మి)
మన తెలంగాణ (శరత్)
కథలు
జయ జయహే తెలంగాణ (రమణ మాదన)
ఎల్లలు ఎరుగని స్నేహం (డా.సంయుక్త మాడిశెట్టి)
అవ్వ చేతి బువ్వ (డా.కాలువ మల్లయ్య)
రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే (మోహన్ ఋషి)
తప్పు ఎవరిది (పద్మ సనం)
పాటలు
జాతర (నంద కిషోర్)
మబ్బెందుకొచ్చినాదో (నంద కిషోర్)
వ్యాసాలు
Three Day Program at A Glance (Prof. Sunkari Ram Murthy)
Telangana Government Open Data Policy (Rakesh Dubbudu)
Prof. Jaya Shankar – A Visionary of Telangana (Anchita Sanam)
Seven Habits of Highly effective Telangana Leaders (Krishna Chaitanya Allam)
అస్తిత్వ స్పృహతో అంకురించిన ATA ( నారదాసు లక్ష్మణ రావు)
తెలంగాణ అస్తిత్వాన్ని కదిలించిన పాట (డా. లావణ్య కరిమిండ్ల)
ఆహ్వాన రచనలు-రచయితలు:
(కింద తెలిపిన వారికి ప్రకటించిన పారితోషకం, సంచిక ప్రతి త్వరలో అందజేయబడుతుంది.)
కవిత్వం
సిద్ది పేట (అశోక్ అవారి) ప్రథమ బహుమతి పారితోషకం 2116/-
నెత్తుటి పునాది (కూకట్ల తిరుపతి) ప్రథమ బహుమతి పారితోషకం 2116/-
మండే సూర్యుడు (రామా చంద్రమౌళి) ప్రథమ బహుమతి పారితోషకం 2116/-
కొత్త చరిత్ర (రామా చంద్రమౌళి) ప్రథమ బహుమతి పారితోషకం 2116/-
పాటలు
తెలంగాణ సాకారం (గరిగె రాకేశ్) ప్రథమ బహుమతి పారితోషకం 2116/-
కథలు
రాజమ్మ గెలుపు (జయ రెడ్డి బోడ) ప్రథమ బహుమతి పారితోషకం 5116/-
సంతు గాని సంచి (పూర్ణిమ) ప్రథమ బహుమతి పారితోషకం 5116/-
సరస్వతీ నమస్తుభ్యం (మణి మూర్తి వడ్లమణి) ప్రథమ బహుమతి పారితోషకం 5116/-
వ్యాసాలు
అక్షరాన్ని శ్వాసించిన కవి – అలిశెట్టి (నర్సన్) ప్రథమ బహుమతి పారితోషకం 5116/-
త్వరలో సంచిక ప్రతిని ఆన్లైన్ మాధ్యమంలో ఉంచుతాం అని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కలుగ చేస్తామని తెలియచేసారు. ఆహ్వాన రచనలకు పారితోషకం, పుస్తక ప్రతి, అతిథి రచయితలకు పుస్తక ప్రతి త్వరలో అందజేయబడుతాయి. పారితోషకం ప్రకటించిన ఆహ్వాన రచయితలు తమ ఇంటి చిరునామా, బ్యాంకు వివరాలు(అకౌంట్ నంబరు, స్విఫ్ట్ కోడ్, బ్యాంకు బ్రాంచ్ పేరు చిరునామా తదితర వివరాలు kcallam ఎట్ att.netకు పంపగలరు.