నటుడిగానే కాకుండా అందరికి ఆత్మీయుడిగా, నిర్మాతల నటుడిగా ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన కృష్ణ ఇక లేరనే విషయం జీర్ణించుకోలేనిదని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ట మరణ వార్త అమెరికాలో తెలుగువారందరిని కలవరపరిచిందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి పేర్కొన్నారు.