నాట్స్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో బుర్రకథ: సాయి జీవిత చరిత్రను బుర్రకథగా ప్రదర్శన

సోమవారం, 21 డిశెంబరు 2020 (20:24 IST)
టెంపా, ఫ్లోరిడా: అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగువారి కోసం బుర్రకథను ఏర్పాటుచేసింది. మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు కూడా తెలియజేయాలనే సత్సంకల్పంతో నాట్స్ ఈ బుర్రకథ గానాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించింది.
 
బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ శిష్యురాలు యడవల్లి శ్రీదేవి కుటుంబం సాయి జీవిత చరిత్రపై బుర్రకథను ఆన్ లైన్ ద్వారా ప్రదర్శించారు. శ్రీదేవి భర్త విజయకుమార్‌తో పాటు ఆమె తనయుడు నందకిషోర్ కూడా ఈ బుర్రకథలో తంధాన తాన అంటూ శ్రుతి కలిపి వీక్షకులను ఆకట్టుకున్నారు. సాయి జీవిత చరిత్రను శ్రీదేవి కుటుంబం ఎంతో లయబద్ధంగా, వీనులవిందుగా వినిపించింది.
 
అల్లూరి సీతారామరాజు స్వరాజ్యపోరాటం, వీరాభిమన్యుడి వీరోచిత ఘట్టాలను కూడా బుర్రకథ ద్వారా వినిపించి తెలుగువారిలో దేశభక్తిని, మనోధైర్యాలను నింపే ప్రయత్నం చేసింది. ఈ బుర్రకథకు నాట్స్ నుంచి అనుసంధానకర్తలుగా నాట్స్ నాయకులు డాక్టర్ సూర్యంగంటి, డాక్టర్ మధు కొర్రపాటి, ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని వ్యవహారించారు. ఆన్‌లైన్ ద్వారా వీక్షిస్తున్న వందలాది మందిని శ్రీదేవి కుటుంబం బుర్రకథతో కట్టిపడేసింది. 
 
నాట్స్ మాజీ ఛైర్మన్  శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, రాజేశ్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, శివ తాళ్లూరు, ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా  తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే, సెక్రటరీ రంజిత్ చాగంటి, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మురళీ మేడిచెర్ల, రవి గుమ్మడిపూడి తదితరులకు నాట్స్ టెంపాబే టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు