టెంపాబే: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలబడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా టెంపాబే విభాగానికి కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. ప్రసాద్ ఆరికట్ల సమన్వయకర్తగా, సురేశ్ బొజ్జకు సంయుక్త సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించింది. 2020-22కు సంబంధించి కొత్త నాయకత్వంపై కసరత్తు చేసిన నాట్స్.. టెంపాబే నాట్స్ విభాగంలో ఎంతో చురుకుగా పనిచేస్తున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించింది.
ఈ సందర్భంగా నాట్స్ ఆన్‌లైన్ ద్వారా కిక్ ఆఫ్ ఈవెంట్ నిర్వహించి ఆ ఈవెంట్‌లో కొత్త కమిటీని ప్రకటించింది. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు... నాట్స్ ప్రస్థానం గురించి నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ ఈ ఈవెంట్‌లో వివరించారు. నాట్స్ పాటిస్తున్న విలువలు.. ప్రమాణాల గురించి నాట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. తెలుగువారికి నాట్స్ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుందనే విషయాన్ని నాట్స్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మల్లాది వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ కాండ్రు, ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, మాజీ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శివ తాళ్లూరు తదితరులు పాల్గొని కొత్త నాయకత్వానికి దిశా నిర్థేశం చేశారు.
నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ శేఖర్ అన్నే కొత్త కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ, మరెన్నో నూతన సేవా కార్యక్రమాలు టెంపాబే చాప్టర్ నుండి ఆశిస్తున్నట్టు తెలిపారు. టెంపాబే ప్రకటించిన కొత్త నాయకత్వం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...