వివరాలలోకి వెళ్తే... రిషి ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుటి నుండి తన సోదరుడు, అంకుల్ సాయంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై పట్టు సాధించాడు. వారిద్దరూ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే సంస్థలో సలహాదారులుగా పనిచేస్తున్నారని చెప్తున్న రిషి వారి ప్రోద్భలం వల్లే తాను అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ సంస్థ థెస్సాల్స్ క్యాపిటల్‌లో భాగస్వామిని కాగలగానని అంటున్నాడు.
థెస్సాల్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ మాట్లాడుతూ రిషిలో అద్భుతమైన ప్రతిభ దాగివుందనీ, దానికి గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై చిన్న వయసులోనే పట్టు సాధించడమంటే మాములు విషయం కాదన్నారు. ఎంతో తపన ఉంటే తప్ప అది సాధ్యం కాదన్నారు. భవిష్యత్తులో రిషి ఉన్నత స్థానాలను అధిరోహిస్తాడని ఆయన తెలిపారు.