భారత ఎంబసీ న్యాయ సలహాదారుగా "అనూ"

FILE
భారత ఎంబసీ న్యాయ సలహాదారుగా కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ అటార్నీ అనూ పేష్వారియా నియమితులయ్యారు. కాగా.. క్రియాశీల సామాజిక కార్యకర్త, మాజీ క్రీడాకారిణి అయిన అనూ.. మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ సహోదరి కావడం విశేషం.

భారత ఎంబసీ లీగల్ అడ్వయిజర్‌గా.. భారత ఎంబసీకేకాక న్యూయార్క్, చికాగో, హ్యూస్టన్, శాన్‌ప్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్లకు అనూ న్యాయ సహకారాన్ని అందజేయనున్నారు. అలాగే అట్లాంటా, షీటెల్‌లోని కాన్సులేట్లకు సైతం ఆమె సేవలను పొడిగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. న్యాయ సలహాదారుగా ప్రపంచ ప్రసిద్ధురాలైన అనూ.. ఎన్నారై కమ్యూనిటీలో చోటు చేసుకుంటున్న మోసపూరిత వివాహాలపై కూడా పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా "ది ఇమ్మిగ్రంట్స్ డ్రీం (ఓ వలసవాది కల" అనే పుస్తకాన్ని రచించారు. "సేవా లీగల్ ఎయిడ్" పేరుతో ఈమె ఓ న్యాయ సహాయ సంస్థను నెలకొల్పారు. కాగా.. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది.

వెబ్దునియా పై చదవండి