"ఏ లెజండరీ యాక్ట్రస్ మహానటి సావిత్రి" పుస్తకావిష్కరణ

కాలచక్ర భ్రమణంలో దశాబ్దాలు కరిగిపోయినా, తరాలు మారినా ఆ మహానటి ప్రదర్శించిన అభినయ ప్రమాణాలు తెలుగు వారి గుండెల్లో నిత్య స్మరణీయంగా నిలిచిపోతాయి. అందుకే ఆ మహానటికి ఖండాంతరాలలోకూడా అభిమానులు, ఆరాధకులు ఉన్నారు.

న్యూయార్క్‌లోని జేమ్స్ విల్లీకి చెందిన ప్రవాసాంధ్రులు వి.ఆర్.మూర్తి, వి. సోమరాజులు సంయుక్తంగా మహానటి సావిత్రి జీవిత చరిత్రను అక్షర బద్దం చేస్తూ ఇంగ్లీష్‌లో "ఏ లెజండరీ యాక్ట్రస్ మహానటి సావిత్రి" అనే పుస్తకాన్ని రచించారు. కాగా ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం మే 4 దర్శకరత్న డా. దాసరి నారాయణరావు చేతుల మీదుగా జరుగనుంది.

ఈ పుస్తకానికి ముందు మాట వ్రాసిన దాసరి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని సావిత్రి కుమార్తె శ్రీమతి విజయ చాముండేశ్వరికి అందజేస్తారు. విజయవాడకు చెందిన మహానటి సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి పరుచూరి విజయలక్ష్మీ, మురళీల ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం మే 4న దాసరి నారాయణ స్వగృహంలో జరుగుతుంది.

వెబ్దునియా పై చదవండి