ఒలింపిక్ రన్నింగ్ : 800 మీటర్ల స్వర్ణం కెన్యా సొంతం

శనివారం, 23 ఆగస్టు 2008 (18:02 IST)
బీజింగ్ ఒలింపిక్ 800 మీటర్ల పరుగు పందెంలో కెన్యా స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. కెన్యాకు చెందిన విల్‌ఫ్రీడ్ బుంగై అద్భుతమైన వేగంతో పరుగెత్తి ఈ విభాగంలో స్వర్ణాన్ని సాధించాడు.

బీజింగ్‌లో శనివారం జరిగిన ఈ పోటీలో ఒక నిమిషం 44.65 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా బుంగై స్వర్ణాన్ని సాధించాడు. అలాగే ఈ పోటీల్లో సూడాన్‌కు చెందిన ఇస్మాయిల్ అహ్మద్ రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఒక నిమిషం 44.70 సెకన్ల లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా ఇస్మాయిల్ రజతాన్ని సాధించాడు.

ఈ విభాగంలోని కాంస్య పతకాన్ని కెన్యాకే చెందిన అల్‌ఫ్రెడ్ యేగో సొంతం చేసుకున్నాడు. ఒక నిమిషం 44.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా యేగో కాంస్యం సొంతం చేసుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి