ఐదు ఖండాలకు ప్రతీకలుగా ఒలింపిక్స్ రింగులు

మంగళవారం, 5 ఆగస్టు 2008 (20:13 IST)
ఒలింపిక్స్ గేమ్స్‌ను ప్రతిబింబించే ఐదు రింగులు ఐదు ఖండాలకు ప్రతీకలుగా నిలవడం విశేషం. ఇందులో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఐరోపాలు. ప్రపంచ పటంపై మొత్తం ఏడు ఖండాలు ఉండగా అందులో అంటార్కిటికా, ఆర్కిటిక్‌లలో జనావాసాలు లేవు. అత్యంత శీతల ప్రాంతమైన అంటార్కిటికాలో అసలు జీవ ప్రాణులు సైతం మనజాలవు. ఇది దక్షిణ ధృవం వద్ద ఉంది.

ఒలింపిక్ నియామవళి ప్రకారం ఐదు ఖండాలలోని క్రీడాకారులను కలిపే వేదిక విశ్వ క్రీడలు లేగా ఒలింపిక్స్. ఒలింపిక్స్ గేమ్స్ పతాకంపై ఆరు రంగులు ఉంటాయి. ఇందులో ఐదు రింగులు నీలం, నలుపు, పసుపు, ఎరుపు, పచ్చలలో ఉండగా, ఆ వెనుక తెలుపు వర్ణం ఉంటుంది.

ఒలింపిక్ గేమ్స్‌కు ముందు ఐదు ఒలింపియాడ్‌లను 1914 వరకూ నిర్వహించారు. ఆధునిక ఒలింపిక్ క్రీడలకు 1913లో రూపకల్పన జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఒలింపిక్ పతాకాన్ని 1913లో రూపొందించారు. ప్రపంచ దేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలు విలసిల్లాలని నిర్వాహకులు భావించారు. ఒలింపిక్ పతాకాన్ని మొదటిసారి ఎగురవేసింది 1920 ఆంట్వెర్ప్ ఒలింపిక్స్‌లో.

వెబ్దునియా పై చదవండి