బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు తరపున వివిధ క్రీడల్లో రైల్వేకు చెందిన 15మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. విశ్వ క్రీడల్లో భారత జట్టు తరపున 57 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో భారతీయ రైల్వే క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను నిరూపించుకుంటున్నారు.
భారతీయ రైల్వే క్రీడాకారులు ఏషియాడ్, కామన్‌వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్నారు. క్రీడాకారుల జాబితాను పరిశీలిస్తే డోలా బెనర్జీ (ఆర్చరీ), బొంబాయలా దేవి (ఆర్చరీ), మంగల్ సింగ్ కంపియా (ఆర్చరీ), రంజిత్ మహేశ్వరి (అథ్లెటిక్), కృష్ణ పూనియా (అథ్లెటిక్), జేజే శోభ (అథ్లెటిక్), సుస్మితా సింఘా రే (అథ్లెటిక్), జీజీ ప్రమీలా (అథ్లెటిక్), ప్రీజా శ్రీధరన్ (అథ్లెటిక్), ఎస్ గీతా (అథ్లెటిక్), జితేందర్ (బాక్సింగ్), అఖిల్ కమార్ (బాక్సింగ్), దినేష్ (బాక్సింగ్), సుషీల్ కుమార్ (రెజ్లింగ్), రాజీవ్ తోమంర్ (రెజ్లింగ్) లు.
భారతీయ రైల్వేలో పనిచేసే క్రీడాకారుల కోసం రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (ఆర్ఎస్‌పీబీ) ని 1928లో రైల్వే శాఖ ఏర్పాటుచేసింది. రైల్వే క్రీడాకారులు ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొని భారతీయ రైల్వే కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేస్తున్నారు.