క్రీడా సదుపాయాలు పెంచండి : కపిల్ దేవ్

బుధవారం, 6 ఆగస్టు 2008 (16:15 IST)
ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు ఎక్కువగా పతకాలు సాధించేలా దేశంలో క్రీడా సదుపాయాలు పెంచాలని కేంద్ర క్రీడా శాఖను మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అభ్యర్ధన చేశారు. భారత క్రీడాకారులు ప్రతిసారీ అరకొర సదుపాయాలతో కఠోర శిక్షణ చేసినా ఫలితాలు ఆశించిన స్థాయిలో రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విశ్వ క్రీడల్లో భారత జట్టుది ఎప్పుడూ నిరాశాజనక ప్రదర్శనేనని బాధపడ్డారు. ఇకముందైనా ఈ పరిస్థితి మారాలాని ఆశించారు. వంద కోట్ల మంది భారతీయుల నుంచి కేవలం దాదాపు 60 మంది క్రీడాకారులే బీజింగ్ ఒలింపిక్స్‌లో బరిలోది దిగటం బాధాకరంగా ఉందన్నారు. మనకంటే జనాభా పరంగా చిన్న దేశాలైన అమెరికా, బ్రిటన్‌ల నుంచి భారీ సంఖ్యలో క్రీడాకారులు పాలుపంచుకుంటున్నారని తెలిపారు.

భారత జట్టు వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖేల్ రత్న అవార్డును కైవసం చేసుకోవడంపై కపిల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారత జట్టులో ధోనీ లాంటి క్రీడాకారులు చాలామంది రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) టోర్నీ తదుపరి విడత అక్టోబరు మధ్యకాలంలో ఉంటుందని కపిల్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి