తుది విడత వేలానికి లెనోవా సన్నాహాలు

శుక్రవారం, 1 ఆగస్టు 2008 (16:37 IST)
బీజింగ్ ఒలింపిక్స్ సందర్భంగా నోట్‌బుక్ పీసీల వేలానికి లెనోవా సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా వినియోగదారులు జులై 28వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీలోపు నోట్‌బుక్ పీసీల వేలంలో పాల్గొనాలి. ప్రపంచవ్యాప్తంగా జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, యూఎస్ఏ, హాంకాంగ్, అర్జెంటీనా, చైనా, బ్రెజిల్, భారత్, కెనడాలలో 10 పీసీల వేలానికి లెనోవా ఏర్పాట్లు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా పీసీల వేలంపాట కార్యక్రమానికి క్లౌడ్ ఆఫ్ ప్రామిస్‌గా లెనోవా నామకరణం చేసింది. ఒలింపిక్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని లెనోవా ఈ చర్యలు చేపట్టింది. పీసీల కొనుగోలు ద్వారా వచ్చిన మొత్తాన్ని లెనోవా హోప్ ఫండ్‌లో జమ చేస్తారు. ఆ నిధులతో పిల్లలు, సూక్ష్మ రుణం, చిన్న, మధ్య తరహా కంపెనీల వారి కోసం క్రీడా పోటీలను నిర్వహిస్తారు.

లెనావో ప్రపంచవ్యాప్తంగా గత ఆరు నెలలుగా క్లౌడ్ ఆఫ్ ప్రామిస్ పేరిట పీసీలను వేలానికి ఉంచింది. ఒలింపిక్ టార్చ్ థీమ్డ్ నోట్‌బుక్ పీసీల కోసం భారీ సంఖ్యలో వినియోగదారుల నుంచి స్పందన వచ్చిందని లెనోవా సీనియర్ ఉపాధ్యక్షుడు దీపక్ అద్వానీ చెప్పారు. పీసీలను సొంతం చేసుకోవడానికి అనేకమంది ముందుకువచ్చారని తెలిపారు. పీసీల వేలం ద్వారా ప్రపంచ దేశాల్లో అసమానతలను తొలగించటానికి కృషి జరుపుతామని అద్వానీ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి