నేను నిర్దోషిని : వెయిట్‌లిఫ్టర్ మోనికా దేవి

బుధవారం, 6 ఆగస్టు 2008 (14:09 IST)
డోప్ టెస్టులో పట్టుబడ్డ భారత వెయిట్‌లిఫ్టర్ మోనికా దేవి నిర్దోషినని ప్రకటించింది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మోనికా ఆవేదన వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ)లోని కొందరు కుట్రవల్లే ఇది జరిగిందని ఆరోపించారు. వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత జట్టు తరపున బరిలోకి దిగుతున్న ఏకైక క్రీడాకారిణి మోనికా దేవి.

ఒలింపిక్ అర్హతా పోటీల్లో డోప్ ఆరోపణలకు దూరంగా తాను భారత జట్టుకు ఎంపికయ్యానని తెలిపారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు లాగానే తాను కూడా అత్యున్నత క్రీడా ప్రమాణాలను బీజింగ్‌లో ప్రదర్శించటానికి సిద్ధమయ్యానని వివరించారు. డోప్ టెస్టులో నిందితురాలుగా తేలితే తనపై జీవితకాల వేటు వేయమని మోనికా కంటతడి పెట్టుకుని చెప్పారు.

బెంగళూరులో జులైలో నిర్వహించిన అర్హతా పోటీల్లో ఆంధ్ర ప్రదేశ్ క్రీడాకారిణి పూజరి శైలజ కంటే మెరుగైన క్రీడా ప్రతిభను కనబరిచి ఒలింపిక్స్‌కు ఎంపికైంది మోనికా. శైలజను ఎంపిక చేయడంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు నిర్లక్ష్యం వహించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

వెబ్దునియా పై చదవండి