అక్షయ నవమి నాడు వృద్ధి యోగం, రవి యోగం ఏర్పడతాయి. ఈ సమయంలో పూజ చేసుకోవడానికి చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం వుంటే మంచిది. అక్షయ నవమి నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది. అక్షయ నవమి నాడు శ్రీహరిని ఆరాధించి జామకాయలను నైవేద్యంగా పెట్టాలి.
సత్య యుగం అక్షయ నవమి రోజున ప్రారంభమైందని విశ్వాసం. అందుకే అక్షయ నవమి రోజును సత్య యుగాది అని కూడా పిలుస్తారు. ఇది అన్ని రకాల దాన-పుణ్య కార్యకలాపాలకు చాలా ముఖ్యమైన తిథి. అక్షయ అనే పేరు సూచించినట్లుగా, ఈ రోజున ఏదైనా దాన లేదా భక్తి కార్యకలాపాలు చేయడం వల్ల కలిగే ప్రతిఫలం ఎప్పటికీ తగ్గదు. ఈ జన్మలోనే కాకుండా పుణ్యఫలం పెరుగుతూ వుంటుందని విశ్వాసం.
అక్షయ నవమి రోజు అక్షయ తృతీయ రోజు వలె ముఖ్యమైనది. అక్షయ తృతీయ త్రేత యుగాది అయితే, నాలుగు యుగాలలో త్రేత యుగాలు ప్రారంభమైన రోజు. అలాగే అక్షయ నవమి సత్య యుగాది. అక్షయ నవమి పవిత్ర దినమైన మధుర-బృందావనంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.