వైశాఖ శుద్ధతదియనాడు చేసే ఏవ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితం అక్షయవౌతుంది. అక్షయతృతీయ’ రోజున ఏది ఇంటికివచ్చినా అది అక్షయంగా పెరుగుతుందని చాలామంది విశ్వసిస్తుంటారు. వీలైనంతవరకూ దానధర్మాలు చేయాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి.
ముఖ్యంగా మంచి నీటిని దానం చేయాలని అంటున్నాయి. అలాగే శెనగలు, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను దానంగా ఇవ్వాలని చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన ఈ జన్మలోనే కాదు వచ్చేజన్మలోను మంచినీటికి ఆహారానికి ఎలాంటి కొరత ఉండదట. రానున్న జన్మలు ఎలాంటివైనా.. మంచినీటికోసం ఆహారం కోసం వెతుక్కోవలసిన అవసరం రాదని స్పష్టం చేస్తున్నాయి.
అందువలన అక్షయ తృతీయ రోజున మంచి నీటిని ఆహార ధాన్యాలను దానం చేయటం మరిచిపోకూడదు. అక్షయ తృతీయ రోజున కందిపప్పు, బియ్యం వంటి ధాన్యాలు కొనడం మంచిదని పండితులు చెబుతున్నారు. బంగారం, వెండితో పాటు ఎరుపు రంగు చీర లేదాఎరుపు రంగు వస్తువులు, వృద్ధులకు, పేద రైతులకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.