తెలంగాణాలో భారీ వర్షాలు... పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

ఠాగూర్

గురువారం, 28 ఆగస్టు 2025 (10:24 IST)
తెలంగాణాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో కరీం నగర్, జగిత్యాల యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ అధికారులు గురువారం సెలవు ప్రకటించారు. ముఖ్యంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 
 
యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు సెలవు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిగా వచ్చే నెల రెండో శనివారం పాఠశాలల పనిదినంగా అధికారులు ప్రకటించారు. మరోవైపు, యాదాద్రి జిల్లాలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇప్పటికే కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
భారీ వర్షాలు, వరదలతో ప్రజలకు ఇబ్బందులు కలగడంపై భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలలతో ఆయన ఫోనులో మాట్లాడి, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని కేటీఆర్‌ను ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు