నోయిడా వరకట్న కేసులో ట్విస్ట్ : నిక్కీ కుటుంబంపై వదిన ఆరోపణలు

ఠాగూర్

గురువారం, 28 ఆగస్టు 2025 (09:22 IST)
గ్రేటర్ నోయిడాలో సంచలనం సృష్టించిన 28 యేళ్ల నిక్కీ భాటి వరకట్న మృతి కేసు ఇపుడు కీలక మలుపు తిరిగింది. నిక్కీని ఆమె అత్తింటివారే కట్నం కోసం సజీవ దహనం చేశారని ఆరోపణలు రావడం, వారిని పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. అయితే, ఈ కేసులో పూర్తి భిన్నమైన వాదన తెరపైకి వచ్చింది. నిక్కీ సొంత వదిన (సోదరుడి భార్య) మీనాక్షి .. నిక్కీ కుటుంబంపైనే తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. తనను కూడా నిక్కీ పుట్టింటి వారు వరకట్నం కోసం తీవ్రంగా హింసించారని ఆమె ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, నిక్కీ సోదరుడు రోహిత్‌తో తనకు 2016లో వివాహం జరిగిందని, పెళ్లి సమయంలో తన తండ్రి మారుతి సియాజ్ కారుతో పాటు 31 తులాల బంగారం ఇచ్చారని, అయినా నిక్కీ కుటుంబం సంతృప్తి చెందలేని ఆరోపించారు. 
 
సియాజ్ కారుకు బదులు స్కార్పియో కారు కావాలని వారు నన్ను తీవ్రంగా హింసించారు. నిక్కీ, ఆమె సోదదరి కంచన్ నన్ను కొట్టేవారు. అత్తమామలు కూడా వారితో కలిసేవారు. వారి వేధింపుల వల్లే నేను రెండుసార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది అని మీనాక్షి ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త రోహిత్ కూడా తనపై తరచూ దాడి చేసేవాడని, ఓసారి తన సోదరుడుపై కూడా కాల్పులు జరిపాడని ఆమె ఆరోపించింది. ఈ వేధింపుల కారణంగా తాను కొన్నేళ్లుగా భర్త ఇంటికి దూరంగా ఉన్నట్టు తెలిపారు. 
 
అదేసమయంలో నిక్కీ అత్తింటివారు మంచివారంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పైగా, నిక్కీని నిప్పంటించుకుని ఉంటుందని అంటున్నారు. నిక్కీ భర్త విపిన్‌కు ఆమె అంటే చాలా ప్రమే అని, చేతికై నిక్కీ పేరును పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడని చెప్పింది. అతడు ఇలా చేసివుంటాడని నేను నమ్మను. బహుశా నిక్కీనే నిప్పంటించుకుని ఉండొచ్చు. విపిన్ కుటుంబం అలాంటిది కాదు అని మీనాక్షి పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు