ఎందుకంటే ఈ పవిత్రమైన రోజు కోపం పడితే.. లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఎవరి ఇల్లు అయితే ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి అడుగు పెడుగుతుంది ఈరోజున మీ ఇంటిని ముఖ్యంగా పూజా మందిరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి.
ఇలా చేస్తేనే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.ఇంకా అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువును, తన భార్య శ్రీ మహాలక్ష్మీని విడివిడిగా పూజించకండి. ఈ పవిత్రమైన రోజున ఈ దేవుళ్లకు కలిపి పూజలు చేయాలి. దీని వల్ల మీకు, మీ కుటుంబానికి సందప, శ్రేయస్సు, ఆశీర్వాదంతో పాటు అక్షయ పుణ్యం లభిస్తుంది.
అలాగే అక్షయ తృతీయ రోజున మజ్జిగ, కొబ్బరి నీళ్లు, తాగు నీరు వంటివి దానం చేస్తే పూర్వ జన్మల పాపాలు తొలగిపోతాయి. అక్షయ తృతీయ రోజున స్థోమతకు తగినంత వెండిని కొనుగోలు చేయడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.