Nandamuri Balakrishna: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారమెత్తిన బాలకృష్ణ (video)

సెల్వి

శనివారం, 16 ఆగస్టు 2025 (14:27 IST)
Balakrishna
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్త్రీ శక్తి ప్రారంభోత్సవం సందర్భంగా స్వయంగా స్టీరింగ్ పట్టి బస్సు నడిపారు. ఈ పరిణామం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శుక్రవారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే, ఎన్నికల హామీలలో భాగమైన సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన 'స్త్రీ శక్తి'ని ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఈ పథకాన్ని బాలకృష్ణ తన నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించారు. 
 
ఈ కార్యక్రమం కోసం హిందూపురం ఆర్టీసీ బస్ స్టేషన్‌కు అభిమానుల కోలాహలం మధ్య చేరుకున్న ఆయన, ముందుగా రిబ్బన్ కట్ చేసి పథకానికి శ్రీకారం చుట్టారు.
 
అనంతరం ఓ బస్సులోకి ఎక్కి, అందులో ప్రయాణిస్తున్న మహిళలతో ముచ్చటించారు. వారి ఆధార్ కార్డులను స్వయంగా పరిశీలించారు. బస్ స్టేషన్ నుంచి పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో ఉన్న తన నివాసం వరకు బస్సును నడుపుకుంటూ వెళ్లారు.

హిందూపురంలో బస్సు నడిపిన #బాలయ్య ????❤️‍????

మరో సూపర్ సిక్స్ హామీ, "స్త్రీ శక్తి - ఉచిత బస్సు ప్రయాణ పథకం" ప్రారంభం.

హిందూపురం RTC బస్ స్టేషన్ నుండి చౌడేశ్వరి కాలనీ మీదగా తన నివాసం వరకు బస్సు నడిపిన నందమూరి బాలకృష్ణ గారు. #NandamuriBalakrishna#HindupurMLA pic.twitter.com/MxQdEABYRR

— ʀᴀᴋʜɪ ᵐᵃʰᵃʳᵃᵃʲ ɴʙᴋ ✨️ (@RakhiNbk) August 15, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు