భాద్రపద మాసం.. శనివార వ్రతం.. ఏలినాటి శని దోషం పరార్

శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (13:27 IST)
భాద్రపద మాసంలో శనివారాలు ఉపవాసం ఉంటే శనిదేవుని వల్ల కలిగే సమస్యలు తీరుతాయని విశ్వాసం. ఇందుకు ఆధారంగా ఓ కథ ప్రాచుర్యంలో వుంది. పూర్వం ఓ పేద పూజారి ఆర్థిక ఇబ్బందులతో కష్టపడేవాడు. అయితే ఆయన శ్రీవారి పట్ల భక్తిని కలిగివుంటుంది. అతనికి జాతకం ఏలినాటి శని వచ్చే సమయం ఆసన్నమైంది. 
 
కానీ ఆయన నిజాయితీగా, న్యాయం కోసం పోరాడేవాడు. ఈ విషయం శ్రీవారికి తెలియవచ్చింది. అయితే తన భక్తుడు ఏలినాటి శని తాకనున్నాడని తెలుసుకున్నారు. వెంటనే శనిభగవానుడి చెంతకు వెళ్లిన శ్రీనివాసుడు "నా భక్తుడిని తాకకూడదని చెప్పాడు. 
 
అయితే శని దేవుడు, అది నా విధి కాదా? నా బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి కదా అంటూ.. చెప్పాడు. మహావిష్ణువు శనిదేవుని మాటల్లోని సమర్థనను గ్రహించాడు. దానికోసం వేరే మార్గం ఆలోచించాడు. 'శని ప్రభూ... నా పరమ భక్తుడిని ఏడున్నరేళ్లు పట్టుకోవద్దు.. ఏడు నిమిషాల పాటు పట్టుకుని వదిలేయ్' అన్నాడు. శని దేవుడు అలాగే చేసాడు. 
 
ఇంకా ఆ పేద పూజారికి సంపదలను ప్రసాదించాడు. అందుచేత భాద్రపద శనివారాల్లో వ్రతం ఆచరించే భక్తులకు శనిగ్రహ దోషాలు, ఏలినాటి శని ప్రభావం వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు