ఈతిబాధలు తొలగిపోతాయి. అనుకున్న కార్యాల్లో విజయం తథ్యం. ఉన్నత అవకాశాలు, పదవులు వరిస్తాయి. ఏలినాటి శనిదోషం తొలగిపోతుంది. సర్వాభీష్టాలు చేకూరుతాయి. కార్యానుకూలత లభిస్తుంది. అలాగే శనివారం నాడు శ్రీవారిని తలచి వేసే పిండి దీపాన్ని నైవేద్యంగా సమర్పించాక ప్రసాదంగా స్వీకరించాలి.
శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతిని ఇలా వైకుంఠంగా భావిస్తారు. ఎంతో మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి చేరుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా శ్రావణంలో వచ్చే శనివారాల్లో ఆయనను స్తుతించడం ద్వారా జీవితం సుఖమయంగా మారిపోతుంది.
పూజా సమయంలో స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు సమర్పించాలి. ఇక స్వామి వారికి పండ్లు, పాయసం చక్కెర పొంగలి, గారెలు పులిహార, కలకండ నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.
పూజా సమయంలో "ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ వేంకటేశ్వరుడిని ఆరాధించాలి. ఆ తరుత స్వామీ వారికి కర్పూర హారతులు ఇచ్చి పూజ ముగించాలి. ఇలా శనివారం పిండి దీపంవెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఇలా ఏడు వారాలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు సూచిస్తున్నారు.