09-08-2020 -ఆదివారం మీ రాశి ఫలితాలు- ఏ వ్యక్తికి అతి చనువు ఇవ్వడం?

ఆదివారం, 9 ఆగస్టు 2020 (05:00 IST)
ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం ద్వారా సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. స్త్రీల సృజనాత్మకతకు, ప్రతిభకు తగిన గుర్తింపు రాణింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం.
 
వృషభం: ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకేస్తారు. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. సమయానికి సహకరించని వ్యక్తుల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు.
 
మిథునం: ఏ విషయంలోను ఎదుటివారిని అతిగా విశ్వసించడం అంత మంచిది కాదు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. చేతివృత్తుల వారికి అంతంత మాత్రంగానే ఉంటుంది. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి. 
 
కర్కాటకం: దంపతుల మధ్య స్వల్ప చికాకులు, అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానంతో ఉల్లాసంగాను, ఉత్సాహంగాను గడుపుతారు. దైవ సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు.
 
సింహం: కంప్యూటర్ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మంచిది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సఖ్యతో లోపిస్తుంది. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. సోదరీ, సోదరుల మధ్య తగాదాలు రావచ్చు.
 
కన్య: ఆర్థిక అవసరాలు ఖర్చులు పెరగడంతో అదనపు రాబడి, ఆదాయానికై శ్రమిస్తారు. మిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యం. దేనియందు ఏకాగ్రత అంతగా వుండదు. అదనపు రాబడి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
తుల: ఆర్థిక లావాదేవీలు, అనుకున్న పనులు ప్రశాంతంగా సాగుతాయి. మత్స్యకోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. మీ మాటకు అన్నిచోట్ల మంచి స్పందన లభిస్తుంది. ఒక దైవ కార్యం ఘనంగా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ వాహనం, విలువైన వస్తువులు విషయంలో మెళకువ అవసరం.
 
వృశ్చికం: నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. వీలైనంత వరకు మితంగా సంభాషించండి. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. నూతన పెట్టుబడులు, స్థిరాస్తి క్రయ విక్రయాల కోసం మరికొంత కాలం ఆగడం మంచిది. 
 
ధనస్సు: ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. రుణాలు తీరుస్తారు. ప్రతి విషయం మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం మంచిది. మీ కదలికలపై నిఘా వుందన్న విషయాన్ని గమనించండి.
 
మకరం: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో పాల్గొంటారు.
 
కుంభం: సొంత నిర్ణయాల వల్ల కలహాలు, చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. సన్నిహితుల సలహా, హితవు మీపై బాగా పనిచేస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
 
మీనం: ఫ్యాన్సీ, పచారి, మందుల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. బంధువుల వైఖరి నిరుత్సాహ పరుస్తుంది. విద్యార్థులు క్రీడా రంగాల్లో బాగా రాణిస్తారు. ట్రాన్స్‌‍పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఏ వ్యక్తికి అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు